కోనసీమ: పి .గన్నవరం మండలం వాడ్రేవుపల్లికి చెందిన తాళ్లూరి శ్రీకాంత్ సామాజిక సేవలకు రాష్ట్ర స్థాయి P4 అవార్డు దక్కింది. నియోజకవర్గంలోని పేద కుటుంబాల కోసం P4 ప్రోగ్రామ్ ద్వారా ఆయన రూ.51 లక్షలు వెచ్చించారు. తిరుపతిలో జరిగిన P4 వార్షికోత్సవంలో ప్రభుత్వం ఆయనను ఈ అవార్డుతో గౌరవించింది. సొంత నిధులు ఖర్చు చేస్తూ పేదల అభ్యున్నతికి తోడ్పడుతున్నారు.