TG: చేవేళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి చంద్రకళమ్మ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంజిత్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అంతకుముందు చంద్రకళమ్మ చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు.