అన్నమయ్య: మదనపల్లిలో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టమాటా ధరలు భారీగా పడిపోవడంతో పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో బహుజన్ యువసేన (BYS) ఆధ్వర్యంలో నాయకులు, రైతులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరారు.