ATP: గుత్తిలో గ్యాస్ కొరత ఉందంటూ అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రామారావు హెచ్చరించారు. గత మూడు వారాల్లో సుమారు 19 వేల సిలిండర్లు పంపిణీ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ కలహాల వల్ల జరిగిన ఆత్మహత్యాయత్నాన్ని గ్యాస్ కొరతకు ముడిపెట్టి ఆందోళన కలిగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.