NLG: జాతీయ రహదారులపై ప్రయాణించే వారి రక్షణ కోసం NHAI ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు 1033 టోల్ ఫ్రీ నంబర్‌ను 24/7 అందుబాటులోకి తెచ్చింది. రహదారి పొడవునా ప్రత్యేక SOS కాల్ బాక్సులను ఏర్పాటు చేశారు. వాహనాలు చెడిపోయినా, ప్రమాదాలు జరిగినా ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి తక్షణమే సాయం పొందవచ్చని అధికారులు తెలిపారు.