AP: పేదల సంక్షేమానికే కూటమి పెద్దపీట వేస్తోందని, తమది పేదల పక్షపాత ప్రభుత్వమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. ఆత్మకూరు బస్టాండ్ దగ్గర CC రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అందరికీ కూడు, గూడు, నీడ కల్పించాలన్నదే CM చంద్రబాబు సంకల్పమని తెలిపారు. అందులో భాగంగా పేదరిక నిర్మూలనకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.