ఎన్నో ఔషధ గుణాలున్న వేప చెట్లకు పెద్ద కష్టం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వేలాది చెట్లు ఎండిపోతున్నాయి. దీనికి ‘డైబ్యాక్’ అనే వ్యాధి కారణమని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీన్ని నివారించడానికి ఆకులపై కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయాలని, చెట్టు మొదలులో వర్మీ కంపోస్ట్ వేయాలని సూచిస్తున్నారు. చెట్లను కాపాడటానికి అధికారులే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.