ASF: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో ERS పథకం కింద ముగ్గురు ట్రాన్స్ జెండర్లకు రుణాల చెక్కులను అందజేశారు. ఆసిఫాబాద్ కలెక్టరెట్లో జిల్లా కలెక్టర్ హరిత లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేశారు. 2025- 26 సంవత్సరానికి ఎంపికైన ముగ్గురు ట్రాన్స్ జెండర్లకు స్వయం ఉపాధి కోసం ఈ ఆర్థిక సాయాన్ని అందించారు.