AP: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. రిజర్వాయర్లో 44 TMCల నీరు ఉండటంతో ఇరు రాష్ట్రాలు విద్యుదుత్పత్తిని నిలిపివేశాయి. 10 నెలల్లో కుడి గట్టులో ఏపీ 2060 మి. యూనిట్లు, ఎడమ గట్టులో TG 2,725 మి. యూనిట్ల విద్యుదుత్పత్తి చేశాయి. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు ఈ స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలో 2007-08లో 2,544 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది.