TG: తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన హైదరాబాద్లోని భవనాన్ని GHMC అధికారులు సీజ్ చేశారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఆస్తి వద్ద అధికారులు నోటీసులు అంటించి భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, పన్ను వసూళ్లలో భాగంగా బకాయిదారులపై GHMC కొరడా ఝుళిపిస్తోంది.