AP: తిరుపతిలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటన కొనసాగుతోంది. నిన్న శ్రీవేంకటేశ్వర పశువైద్య వర్సిటీ 13వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఉదయం VIP బ్రేక్ సమయంలో ఆయన ఆలయానికి వెళ్లే అవకాశం ఉంది. కాగా గవర్నర్ రాక నేపథ్యంలో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా TTD అధికారులు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు.