KMR: జిల్లాలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 73 మందికి కోర్టు శిక్షలు విధించింది. ఇందులో 8 మందికి జైలు శిక్ష, అందరికీ కలిపి రూ.86,100 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర సోమవారం తెలిపారు. నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, మద్యం తాగి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆయన హెచ్చరించారు.