ADB: ఆదిలాబాద్ జిల్లా సహకార శాఖ ఇన్ఛార్జ్ అధికారిగా మాదా సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సహకార సంఘాల బలోపేతానికి, పారదర్శకంగా సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని మాదా సత్యనారాయణ పేర్కొన్నారు.