Amith Shah: రేపటి మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటన రద్దు
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఇంకు బీహార్లో రాజకీయ పరిణామాలే కారణమని తెలుస్తోంది. వాస్తవానికి ఆదివారం ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది.
Amit Shah said Modi government open schools congress government will bring liquor shop in chhattisgarh
Amith Shah: కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఇంకు బీహార్లో రాజకీయ పరిణామాలే కారణమని తెలుస్తోంది. వాస్తవానికి ఆదివారం ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. అమిత్ షా పర్యటన రద్దు అయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించాల్సిన కార్యక్రమం ఉంది. కానీ కొన్ని అత్యవసర పనుల వల్ల రాష్ట్రంలో అమిత్ షా పర్యటన వాయిదా పడిందన్నారు. దీంతో కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సమావేశాలు వాయిదా వేశామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే అమిత్ షా పర్యటన ఉంటుందని అంతా భావించారు. ఈ యాత్రలో మూడు జిల్లాల్లో జరిగే కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ సిద్ధమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోగా.. ఈసారి ఆ సంఖ్య పెరిగింది. ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్గా తీసుకోనుంది.