మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్లనే లేదు.. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్సీ 16 ఫస్ట్ లుక్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Ram Charan: రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అతి త్వరలోనే కంప్లీట్ కానుంది. వచ్చే దసరాకు గేమ్ చేంజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఆర్సీ 16కి రంగం సిద్ధమవుతోంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేయనున్న ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే అనౌన్స్ చేశారు. సతీష్ కిలారు నిర్మాతగా వ్రిద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కకున్న ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇంకా హీరోయిన్ ఎవరనేది క్లారిటీ రాలేదు. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలాగే హైదరాబాద్‌లో రంగస్థలం సినిమాకు వేసిన ఏరియాలో భారీ సెట్టింగ్స్ వేస్తున్నారట.
ఇప్పటికే ఆర్సీ 16లో చరణ్ క్యారెక్టర్ రంగస్థలం మూవీలో చిట్టిబాబు పాత్రకు మించి ఉంటుందని స్వయంగా రామ్ చరణే చెప్పాడు. ఇప్పుడు రంగస్థలం సెట్ సెంటిమెంట్ కూడా కలిసి రానుంది. దానికితోడు యాక్షన్, ఎమోషనల్ అంశాలు కలగలిపి చరణ్ పాత్రని మాస్ స్టైల్లో అద్భుతంగా రాసుకున్నాడట బుచ్చిబాబు. మార్చి సెకండ్ వీక్‌లో ఆర్సీ 16 షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. అంతేకాదు.. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో ఈసారి చరణ్ బర్తే డే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవనే చెప్పాలి. మరి ఆర్సీ 16 ఎలా ఉంటుందో చూడాలి.