దేవర వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అదే డేట్‌కు రావడానికి మిగతా హీరోలు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ దేవర ప్లేస్‌ను కబ్జా చేయడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్లో సైఫ్ అలీఖాన్‌కు గాయాలయ్యాయి. సర్జరీ కూడా జరిగింది. దీంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడింది. ఇదే సమయంలో ఏపి ఎలక్షన్స్‌కు రంగం సిద్దమైనట్టుగా కన్ఫామ్ అయ్యాయి. దీంతో దేవర వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు గానీ.. దేవర పోస్ట్ పోన్ అయిన వెంటనే అదే డేట్‌కి రావడానికి కొన్ని తెలుగుల సినిమాలు రెడీ అవుతున్నాయి. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఏప్రిల్ 5 దేవర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఇప్పుడు వాయిదా పడుతుందనే టాక్ నడుస్తోంది.
దీంతో అదే రోజు విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ మూవీని రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవకపోవడంతో.. ఈసారి ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో దేవర ప్లేస్‌లో దేవరకొండ రావడం పక్కా అంటున్నారు. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం పెట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. అలాగే.. టిల్లు స్క్వేర్ కూడా ఏప్రిల్ నెలలో ఇదే డేట్‌కు వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా దేవర డేట్ మారితే.. పలు సినిమాల రిలీజ్ డేట్స్‌లో మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. మరి దేవర వాయిదా పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.