పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సలార్ మూవీ థియేటర్లో మాసివ్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఓటిటిలో కూడా అదరగొడుతోంది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఓటిటి సినిమాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
Salar: డిసెంబర్ 22న భారీ అంచనాల మధ్య సలార్ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సలార్ వెయ్యి కోట్ల బొమ్మ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ హిందీలో షారుఖ్ ఖాన్ డంకీ సినిమా కారణంగా థియేటర్లు దొరకలేదు. దీంతో నార్త్‌లో అనుకున్నంత రేంజ్లో సలార్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయినా కూడా ఓవరాల్‌గా ఫస్ట్ డే 176 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి.. లాంగ్ రన్లో 750 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే.. ఓ వైపు సలార్ థియేటర్లో రన్ అవుతుండగానే.. రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటిటిలోకి వచ్చేసింది. థియేటర్లో లాగే ఓటిటిలో కూడా దుమ్ములేపుతోంది సలార్ సినిమా. జనవరి 20 నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ వ్యూస్‌ను దక్కించుకుందిది. రెండు రోజుల్లోనే ఐదు మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
మొత్తంగా నాలుగు రోజుల్లో పదకొండు మిలియన్ల వరకు వ్యూస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో తక్కువ టైమ్‌లోనే ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న మూవీగా సలార్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని అంటున్నారు. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడంతో.. సలార్‌కు భారీ స్థాయిలో వ్యూస్ వచ్చినట్లుగా చెబుతున్నారు. సలార్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అందుకే నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ చేశారని అంటున్నారు. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు.. సీక్వెల్ కూడా ఉంది. శౌర్యాంగ పర్వం టైటిల్‌తో 2025లో సలార్ 2 రానుంది. మరి శౌర్యాంగ పర్వం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.