WGL: పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ప్రభుత్వ మంచినీటి బోరును పైపులతో సహా తొలగించి వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు బానోతు దస్రు, భాను, వినోద్‌పై సోమవారం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. మండల అధికారులకు పలుమార్లు చెప్పిన చర్యలు తీసుకోలేదని తండావాసులు తెలిపారు.