VZM: బంగారు కుటుంబాల వారు నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపాలని తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పాలవలస యశస్విని కోరారు. సోమవారం గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పీ-4 కార్యక్రమం ఏడాది పూర్తయిన సందర్భంగా సదస్సు జరిగింది. రాష్ట్రంలో 10% గల బంగారు కుటుంబాల వారు అట్టడుగు కుటుంబాల వారిని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు.