AKP: పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్లో పారిశుధ్య పరిస్థితి సరిగా లేదని స్థానిక వర్తక వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎం రమేష్ నాయుడు, అధ్యక్షుడు టి.నర్సింగరావు తెలిపారు. పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అగనంపూడి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు.