NRML: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా నాయకుడు రాజన్న అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నూతన లేబర్ కోడ్ పత్రాలను దహనం చేసి పాత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.