TG: డీలిమిటేషన్ పద్ధతి మారకపోతే భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోతుందని CM రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఉత్తరాదిలోని 5 రాష్ట్రాల సీట్లు గెలిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందని, అప్పుడు దక్షిణాది గొంతుకకు విలువ ఉండదని హెచ్చరించారు. ఈ వ్యత్యాసం వల్ల ప్రాంతీయ అసమానతలు ఎక్కువై దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు.