SDPT: అంతర్జాతీయ జీరో వేస్ట్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ‘మై భారత్’ కార్యాలయంలో ప్లాస్టిక్ రహిత సమాజంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రాం అధికారి జి. కిరణ్ కుమార్ చేతుల మీదుగా అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు.