GDWL: జిల్లాలో ఆశా కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కె. సునీత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ. 18,000 అమలు చేయాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చర్చలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.