ADB: జిల్లాలోని అర్హులైన షెడ్యూల్ కులాల యువతీ, యువకులు స్వయం ఉపాధి, ట్రాన్స్పోర్ట్, వ్యవసాయ సంబంధ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా తెలియజేశారు. యూనిట్ విలువ రూ. 1 లక్ష నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు http://tgobmms.cgg.gov.in/ వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 8లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.