ఎప్పుడెప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే, అది మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎట్టకేలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి సూపర్ అప్డేట్ ఒకటి వచ్చేసింది.
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా డే వన్ నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా కూడా రికార్డ్ స్థాయిలో కలక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లో 212 కోట్లు రాబట్టి రీజనల్ లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళితో SSMB 29 ప్రాజెక్ట్ చేయనున్నాడు మహేష్ బాబు. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. ప్రజెంట్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరోవైపు గుంటూరు కారం పనులు అయిపోయాయి కాబట్టి.. మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 కోసం జర్మనీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ జరిగే వర్క్ షాప్‌కు అటెండ్ అయ్యాడని టాక్ నడుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు విజయేంద్రప్రసాద్. ఓ ఇంటర్వ్యూలో SSMB29 స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని అన్నారు. మహేష్ బాబు సినిమా కథ పూర్తయింది.. అంటూ చెప్పుకొచ్చారు.
ఇక స్క్రిప్ట్ లాక్ అయింది కాబట్టి.. నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడమే లేట్. స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ అయిపోయి.. మహేష్ బాబు వర్క్ షాప్ కంప్లీట్ చేస్తే.. ఆ తరువాత వెంటనే షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఏదేమైనా.. విజయేంద్ర ప్రసాద్ మాత్రం మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పేశాడు. మరి ఈ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.