»Mallikarjun Kharge Jamili Elections Are Unconstitutional
Mallikarjun kharge: జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం
ఒకే దేశం - ఒకే ఎన్నిక ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.
Mallikarjun kharge: ఒకే దేశం – ఒకే ఎన్నిక ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సామాఖ్య హామీలకు ఇది విరుద్ధమని.. కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీకి ఖర్గే లేఖ రాశారు. దేశంలో పటిష్ఠమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే.. ఈ ఆలోచనను విరమించుకోవాలన్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా.. కమిటీ ఛైర్మన్ తన వ్యక్తిత్వాన్ని, మాజీ రాష్ట్రపతి కార్యాలయాన్ని దుర్వినియోగం చేసేందుకు కేంద్రాన్ని అనుమతించవద్దు. పార్టీ, దేశ ప్రజల తరపున ఈమేరకు అభ్యర్థిస్తున్నా అని ఖర్గే పేర్కొన్నారు. ఏకకాలంలో ఎన్నికల వంటి అప్రజాస్వామిక ఆలోచనల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించకుండా వారి ఆదేశాన్ని గౌరవించచేలా ప్రభుత్వం, పార్లమెంట్, ఎన్నికల సంఘం కలిసి పనిచేయాలన్నారు. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ సైతం ఇటీవల జమిలి భావనతో ఏకీభవించడం లేదని తెలిపిన సంగతి తెలిసిందే.