TG: రాష్ట్రంలో రోడ్డు భద్రత, అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా ప్రమాదాల నివారణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. HAM విధానంలో వేల కి.మీల మేర రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నేషనల్ హైవేల విస్తరణతో ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందన్నారు. సురక్షిత ప్రయాణమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.