AP: స్థానిక మత్స్యకారులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి వినూత్నంగా కృషి చేస్తున్నామని, గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. అలాగే, విశాఖలో ‘అర్సెలార్ మిట్టల్’ ఆధ్వర్యంలో భారీ స్టీల్ సిటీని నిర్మిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.