ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ న్యూస్ మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉంది.
Ram Charan:మూవీ లవర్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. కానీ అనుకుకున్న సమయానికి మాత్రం గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అవడం లేదు. దీంతో చరణ్ క్యాలెండర్లో 2023లో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. కానీ 2024లో మాత్రం గేమ్ చేంజర్ రావడం పక్కా. అయితే.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేదే క్లారిటీ లేకుండా ఉంది. ఫైనల్‌గా ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఇదే అంటున్నారు.
మార్చి వరకు గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసి.. వచ్చే దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోను దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అక్టోబర్‌లో గాంధీ జయంతి లేదా దసరా కానుకగా గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. టీజర్ లేదా సాంగ్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. సంక్రాంతి కోసం మూడు రోజుల బ్రేక్ తీసుకున్న చిత్ర యూనిట్.. ఇప్పుడు తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసింది.
ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక.. గేమ్ చేంజర్ సినిమాని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ బుచ్చిబాబుతో కలిసి ఆర్సీ 16 షూటింగ్లో జాయిన్ అవనున్నాడు రామ్ చరణ్. ఏప్రిల్ లో RC16 మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.