ADB: దేశ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు జనగణన అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. పట్టణంలోని టీటీడీసీలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సెన్సస్- 2027 ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. జనగణన నుంచి జన కళ్యాణం అనే నినాదంతో ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.