MHBD: అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న పేదలకు సీఎం సహాయనిధి ఒక వరంలా మారిందని డోర్నకల్ మండలం కన్నెగుండ్ల గ్రామ సర్పంచ్ రమ్య- సంపత్ తెలిపారు. సర్పంచ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం CMRF చెక్కులను పంపిణీచేశారు. గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.1,09,500 విలువ గల చెక్కులను అందచేశారు.