KNR: మున్సిపల్ సిబ్బందిని వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ చొప్పదండి మున్సిపల్ కమిషనర్‌పై బీజేపీ నేత తాడూరి శివకృష్ణ ప్రజావాణిలో జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం సమర్పించిన వినతిపత్రంలో ప్రజా పనులకు వినియోగించాల్సిన సిబ్బందిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం వల్ల పట్టణంలో పారిశుద్ధ్య పనులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.