MBNR: నవాబుపేట మండలంలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మాదకద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో ‘పిల్లల భద్రత-డ్రగ్స్‌కు అడ్డుకట్ట’ అంశంపై నవాబుపేట, చౌడూరు, యన్మన్ గండ్ల, కొల్లూరు గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.