సత్యసాయి: కుమార్తె అనారోగ్యంతో భోపాల్ ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ గోపి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ధర్మవరానికి చెందిన గోపి భార్య శంకరకుమారి, కుమార్తె మౌనిక మృతి చెందడం విషాదకరమని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపి త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.