TG: హైదరాబాద్ శివారు వట్టినాగులపల్లిలో రూ.1400 కోట్ల భూమిని మంత్రి పొంగులేటి కబ్జా చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. భూ యజమానుల ఇంటికి వెళ్లి మంత్రి, మంత్రి కుమారుడు హర్ష బెదిరించారన్నారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నట్లు పొంగులేటి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ భూ వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది.