Nithin: షూటింగ్లో ప్రమాదం.. హీరో నితిన్‌కు గాయాలు!
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. నితిన్‌కు గాయాలు అవడంతో.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారట.
Nithin: గత కొన్నాళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు నితిన్. ఇటీవల వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఎక్స్ట్రార్డినరీ మ్యాన్’తో కూడా హిట్ కొట్టలేకపోయాడు. దీంతో అప్ కమింగ్ సినిమాల పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం భీష్మతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో పాటు వేణు శ్రీరామ్‌తో తమ్ముడు అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం ఏపీ లోని మారేడుమిల్లి అడవులకు వెళ్లారు.
అక్కడ కొన్ని భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. దీంతో షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో.. నితిన్‌కు గాయాలు అయినట్లుగా తెలుస్తుంది. నితిన్ చేతికి గాయాలు అయ్యాయట. పరీక్షించిన డాక్లర్లు మూడు వారాలు పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారని సమాచారం. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది.
భారీ యాక్షన్ సీక్వెన్స్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు టాక్. అయితే నితిన్‌కు ప్రమాదం అని తెలియడంతో.. అతని ఫ్యాన్స్ కాస్త ఆందోళన పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇకపోతే.. తమ్ముడు సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా సరే సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో కాంతార బ్యూటీ సప్తమి గౌడతో పాటు మరో సీనియర్ హీరోయిన్ లయ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.