Anand Mahindra: అటల్ సేతు బ్రిడ్జి పై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. వైరల్
ఇండియాలో అతి పెద్ద బ్రిడ్జిగా అటల్ సేతు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముంబైలో 21.8 కిలోమీటర్ల పొడవుతో దాదాపు రూ. 18 వేల కోట్ల ఖర్చుతో ఈ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్గా మారింది.
Anand Mahindra's tweet on Atal Setu Bridge.. Viral
Anand Mahindra: భారత్లో అతి పొడవైన బ్రిడ్జ్ అయిన అటల్ సేతు(Atal Setu) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరు పెట్టిన ఈ వంతెనను ఈ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా బ్రిడ్జిని విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ అటల్ సేతు బ్రిడ్జి ఫొటోలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ట్విట్టర్లో పంచుకున్నారు. క్యాప్షన్ అక్కర్లేని, వర్ణించేందుకు పదాలు చాలని ఫొటోలంటూ కామెంట్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దక్షిణ ముంబైని, నవీ ముంబై(Mumbai )ని కలుపుతూ 21.8 కిలోమీటర్ల పొడవుతో దాదాపు రూ. 18వేల కోట్ల ఖర్చుతో 2018లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తం ఆరు లేన్లతో సముద్రంపై 16.5 కిలోమీటర్లు, నేలపై 5.3 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. దీని ద్వారా 2 గంటలు చేసే ప్రయాణం 20 నిమిషాల్లో పూర్తికానుంది. ఇక బ్రిడ్జిపై 100 కిలోమీటర్ల వేగాన్ని కార్లకు కెటాయించారు. ఆటోలకు, బైక్ లకు ఎంట్రీ లేదని ముంబై పోలీసులు తెలిపారు.