Manipur riots: మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. నలుగురు పోలీసులకు గాయాలు
మణిపూర్‌లో కుకి, నాగ తెగలకు సంబంధించిన గొడవలు ఇంకా చల్లారలేదు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం మళ్లీ హింసను కొనసాగిస్తోంది. ఆకస్మికదాడిలో పోలీసులు, బీఎస్ఎఫ్ అధికారి గాయపడ్డారు.
Manipur riot: మణిపూర్(Manipur) గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో మొదలైన అల్లర్లు రాష్ట్రం అంతా దావానంలా వ్యాపించింది. కుకి(Kuki), నాగ(Naga) తెగలకు సంబంధించిన ఇరు వర్గాల దాడిలో వందలాది మంది గాయపడ్డారు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకున్న తరువాత అల్లర్లు కాస్త సద్దుమణిగాయి. మళ్లీ ఇన్నాళ్లకు మణిపూర్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. మరోరే సిటీలో ఈరోజు ఉదయం జరిగిన ఆకస్మికదాడిలో నలుగురు పోలీసు కమాండోలు, ఒక బీఎస్ఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డారు. అలాగే తౌబాల్ జిల్లాల్లో సాయుధ దుండగులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పౌరులను కాల్చారు. తాజాగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు అప్రమత్తమయ్యాయి.
ఈ సంఘటనలు మళ్లీ పునారవృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈ దాడులకు పాల్పడ్డ దుండగులను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. అమాయక ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం రక్షగా ఉంటుందని, నిందితులు ఎలాంటి వారైనా శిక్షిస్తామని సీఎం హెచ్చిరించారు. ప్రజలు కాస్త సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.