ADB: పట్టణంలోని శాంతినగర్లో శుక్రవారం జరిగిన హత్య కేసులో నిందితులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు కేసు దర్యాప్తు అధికారి రాహుల్ కాంత్ ఆదివారం తెలిపారు. ఈ మేరకు నిందితులు రాకేష్, గోపాల్, రవిపై వన్ టౌన్లో కేసు నమోదు చేసి హత్యకు ఉపయోగించిన కర్ర, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన వెల్లడించారు.