ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తన తదుపరి చిత్రాన్ని యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్‌తో చేయనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనుందట. 2021లో ‘చెక్’ తర్వాత యేలేటి తెరకెక్కించబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. విలక్షణ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.