ప్రకాశం: ముండ్లమూరు ఎస్సై కమలాకర్‌కు ప్రశంసా పత్రం అందింది. గుంటూరు జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ చేతుల మీదుగా ఈ గౌరవం లభించింది. అమరావతిలో రూ.9 కోట్ల విలువైన పైపుల దగ్ధం కేసును రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా విచారించగా, అందులో భాగంగా పనిచేసిన కమలాకర్ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఉత్తమ అధికారిగా గుర్తించి ప్రశంస పత్రంతో పాటు అవార్డు అందజేశారు.