TG: MLA కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుపై CM రేవంత్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై వెంటనే ఎథిక్స్ కమిటీ వేసి, ఆ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌశిక్ ప్రవర్తనను సభ సుమోటోగా తీసుకోవాలని, ఇలాంటి తీరును సమర్థిస్తే భవిష్యత్తులో సభలో కత్తిపోట్లు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కఠిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కోరారు.