మూడో భార్య రమ్య నుంచి తనకు ప్రాణ హానీ ఉందని సినీ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నిందని ఆరోపించారు. ఇదే విషయం కోర్టులో ఫిర్యాదు చేశానని వివరించారు. ప్రాణ భయంతో బయటకు వెళ్లడం లేదన్నారు. ఓ పోలీస్ అధికారి సాయంతో తన ఫోన్‌ను రమ్య హ్యాక్ చేయించిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన పర్సనల్ మెసేజ్ రమ్య చూసేదన్నారు. రమ్యతో విడాకులు ఇప్పించాలని కోరారు. గత ఏడాది ఏప్రిల్‌లో తన ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారని ఆరోపించారు. గచ్చిబౌలి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని వివరించారు.
2010 మార్చిలో రమ్యతో పెళ్లి జరిగిందని నరేశ్ తెలిపారు. రెండేళ్లకు బాబు జన్మించాడని తెలిపారు. కట్నం తీసుకోలేదని వివరించారు. రమ్యకు తన తల్లి విజయ నిర్మల రూ. 30 లక్షల విలువ గల ఆభరణాలను చేయించిందని చెప్పారు. పెళ్లైన కొన్ని నెలల నుంచే రమ్య వేధించడం స్టార్ట్ చేసిందన్నారు. తనకు తెలియకుండా రమ్య రూ.లక్షల్లో అప్పులు చేసిందని చెప్పారు. అప్పుల్లో రూ. 10 లక్షలను తీర్చేశానని వివరించారు. తన కుటుంబ సభ్యుల నుంచి కూడా రూ. 50 లక్షల అప్పు చేసిందని నరేష్ ఆరోపించారు.
గత ఏడాదిలో బెంగుళూరులో ఓ హోటల్లో పవిత్ర లోకేష్‌తో నరేష్ కలిసి ఉన్నారు. ఆ సమయంలో రమ్య రఘుపతి పోలీసులతో కలిసి వచ్చారు. వారిపై దాడికి ప్రయత్నించగా రమ్యను పోలీసులు అడ్డుకున్నారు. పవిత్ర లోకేశ్‌తో నరేశ్ సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అని మీడియా ముఖంగా చెప్పేశారు. తనకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి ఎలా అని రమ్య రఘుపతి అంటున్నారు. ఆస్తి కోసం తాను వేధించడం లేదని, తన పుట్టింట్లోనే కోట్ల ఆస్తి ఉందని చెబుతున్నారు.