KDP: మైదుకూరులోని శ్రీరామ్ నగర్లో ఉంటున్న భర్త కోసం భార్య అతని ఇంటి ముందు పోరాటానికి సిద్ధమైంది. తనకు వివాహమై మూడేళ్లైనా.. కాపురానికి రానివ్వడం లేదంటూ విహాహిత ధర్నాకు దిగింది. తన తల్లిదండ్రులు 16 తులాల బంగారం, రూ.7 లక్షలు ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేశారని, తన భర్త కాపురానికి పంపకుండా అత్త, మామ, ఆడపడుచులు అడ్డుపడుతున్నారని న్యాయం చేయాలని నిరసనకు దిగినట్లు ఆమె తెలిపింది.