నెల్లూరులో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. వర్షాకాలం వస్తున్నా అధికారుల వద్ద తగిన నిల్వలు లేవు. ప్రధాన రీచ్‌లు మూతపడ్డాయి. దీనిని ఆసరాగా చేసుకుని నెల్లూరు రూరల్ (కోడూరుపాడు), నెల్లూరు అర్బన్ (భగత్‌సింగ్ నగర్)లో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ట్రాక్టర్‌కు రూ.2 వేలు, టిప్పర్‌కు రూ.5-7 వేల వరకు ప్రజలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.