AP: రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. ఇవాళ రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రా జిల్లాల్లో గరిష్టంగా 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పోలవరం, NTR జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.