భారత్‌కు చెందిన 8 మంది ఖతార్‌లో గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అక్కడి కోర్టు వాళ్లకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా ఖతర్ కోర్టు కీలక తీర్పునిచ్చింది.
Qatar: భారత్‌కు చెందిన 8 మంది ఖతార్‌లో గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అక్కడి కోర్టు వాళ్లకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా ఖతర్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ వాళ్లకి జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అయితే ఎన్నేళ్లు శిక్ష విధించారని మాత్రం స్పష్టం చేయలేదు. భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానికి దళ అధికారి నిర్వహిస్తున్నారు.
భారత్‌కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతార్ అధికారులు 2022 ఆగస్టులో నిర్భంధంలోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం.. ఆ 8 మందికి మరణశిక్ష విధిస్తున్నట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీలను పరిగణనలోకి తీసుకుని వారి మరణశిక్షను రద్దుచేసి జైలు శిక్ష విధించింది. మరణశిక్ష పడిన వారిలో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్‌పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు.