AP: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ అజిత్‌కుమార్ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. నాలుగు రాష్ట్రాల్లో 32 కేసులున్న ఈ నిందితుడు, అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి రాగా, పోలీసుల నిర్లక్ష్యం వల్ల తప్పించుకున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఏఆర్ పోలీసులను SP సస్పెండ్ చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.25 వేల బహుమతి ప్రకటించారు.