NLG: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా నిడమానూరులో 765 కేసులు పరిష్కారమయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో రాజీ పడ్డవి 61, నేరాలు అంగీకరించినవి 222, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 278, పిట్టి కేసులు 204 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జడ్జి స్వప్న, కోర్టు సిబ్బంది, అడ్వకేట్లు పాల్గొన్నారు. సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్ ఎంతో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.